ఇంటర్ ఫలితాలలో  అత్యుత్తమ మార్కులు సాధించిన నారాయణ కాలేజ్ విద్యార్థులు

సూర్యాపేట నారాయణ ప్రభంజనం 

Apr 12, 2026 - 21:21
Apr 12, 2026 - 21:21
 0  1
ఇంటర్ ఫలితాలలో  అత్యుత్తమ మార్కులు సాధించిన నారాయణ కాలేజ్ విద్యార్థులు

సూర్యాపేట, 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇంటర్ పరిక్ష ఫలితాలలో నారాయణ కాలేజ్ సూర్యాపేట విద్యార్దులు ప్రధమ సంవత్సరం ఎంపిసి నందు ముగ్గురు విద్యార్దినులు కన్నెకంటి రుత్విజ, జాహ్నవి, షెక్ ముని బానాజ్ లు 470 కి గాను 468 మార్కులు సాధించి నారాయణ కాలేజ్ సూర్యాపేట బ్రాంచ్ ని  అగ్రస్ధానంలో నిలిపారని కళాశాల ప్రిన్సిపాల్  సిహెచ్  ప్రకాష్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్దిని కోటమర్తి సాత్విక 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి రాష్ట్ర స్ధాయి ర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల యాజమాన్యం, అద్యాపకులు, విద్యార్దుల తల్లిదండ్రులు మరియు విద్యార్దుల సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యం అయిందని కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ప్రకాష్ తెలిపారు.  కళాశాల డీన్ కోట శ్రీనివాస రెడ్డి, ఎజిఎం మందడి సోమి రెడ్డి  మాట్లాడుతూ విద్యార్దులు ఇటువంటి విజయాలు తమ జీవితం లో మరిన్ని సాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపక, అద్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333