అర్ధరాత్రి పూట అక్రమ అరెస్ట్ లు దుర్మార్గం

Jun 4, 2026 - 16:21
Jun 4, 2026 - 16:23
 0  14

రాష్ట్రము లో అప్రకటిత ఎమర్జెన్సీ పాలనను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 అక్రమ అరెస్టులతో నిర్బంధించి ప్రజాపాలన కొనసాగించలేవు రేవంత్ రెడ్డి.

జోగులాంబ గద్వాల 4 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాకు ప్రాజెక్టుల విహారయాత్రకు వస్తున్న రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ మరియు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య లను అర్థరాత్రి ఇంటికి వచ్చి అక్రమంగా ముందుస్తూ అరెస్టు చేసి ఇటిక్యాల మండలం లోని కోదండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రజాపాలనని పేరు చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నడిగడ్డ లోని ప్రాజెక్టు లలో పిడికెడి మట్టినైనా తీసినవా రేవంత్ రెడ్డి.. ఏమి ముఖం పెట్టుకుని నడిగడ్డ ప్రాజెక్టు ల సందర్శనకు వస్తున్నావు.... అడిగేతే నిర్భంధించే రేవంత్ రెడ్డి సర్కార్ కి పాలన చేతకాదు అని తేలిపోయింది అని అన్నారు. 6 గ్యారంటీ లకు పంగనామాలు.. 420 హామీలకు శతగోపం.. ఆయన అన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State