ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ఘనత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దే
బిఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనహృదయనేత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి గోవులకు పండ్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాదులు
తెలంగాణ రాష్ట్రంలో అమావాస్య చీకట్లను పారద్రోలి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికె దక్కుతుందని బిఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షులు నల్లగుంట్ల అయోధ్య, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తలమల్ల హసేన్ లు అన్నారు. మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో టిఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గోవులకు పండ్లు తినిపించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందజేసిన ఘనత మాజీ మంత్రికే దక్కుతుందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా చేయడంతో పాటు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి నేడు ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాడన్నారు. సూర్యాపేటన వేలకోట్లతో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా చేసాడని అందుకే సూర్యాపేట ప్రజలు మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని కాబోయే మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అని అన్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆగిపోయిన అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో గుంటకండ్ల జగదీష్ రెడ్డి సారధ్యంలో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు కాకి రాంరెడ్డి, గ్రంధి వెంకటేశ్వర్లు, కొంపెల్లి లింగయ్య బాణాల విజయ్ కుమార్, డప్పు మల్లయ్య మీసాల శీను రేగట్టి లింగయ్య గౌడ్ అనుములపూరి సైదులు రేగటి శంకరయ్య గౌడ్ పిట్టల వెంకటేశ్వర్లు తొగిటి మురళి అల్లంనేని వెంకటేశ్వరరావు గద్దల శ్రీను చిప్పలపల్లి చిరంజీవి హనుమాన్ చింతల నాగార్జున కొమ్మ రమేష్ జటంగి శ్రీనాథ్ నాగరాజు రత్నావత్ లూనావత్ ప్రేమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు