అంగన్వాడి సెంటర్ ను ఆకస్మిక తనిఖీ అడిషనల్ కలెక్టర్.
జోగులాంబ గద్వాల 4 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- చాగాపురం గ్రామం అంగన్వాడి కేంద్రం రెండు ను అడిషనల్ కలెక్టర్ మరియు డి డబ్ల్యు ఓ ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడి సెంటర్లో కిచెన్ గార్డెన్ బాగా ఉందని అంగన్వాడీ టీచర్ నుఅభినందించారు. సెంటర్లో బాత్రూం కటించాలని కరెంటు వేయించాలని వేసవికాలం ఉన్నందున చిన్న పిల్లలకు ఇబ్బందులు జరుగుతాయని కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడి టీచర్ కు సమయపాలన పాటించి చిన్న పిల్లలకు విద్యాబోధన అందించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.