ఘనంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Jul 19, 2026 - 00:42
 0  3
ఘనంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్యాపేట: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు, అల్పాహార పంపిణీ, కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వి., జగదీశ్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిలర్ హిందు శ్రీ, సూర్యాపేట మండల మాజీ జడ్పీటీసీ జీడీ బిక్షం, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ హాయ్  కళ్లేపల్లి మహేశ్వరి దశరథ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ నిర్వహించగా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జగదీశ్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

60 ఫీట్ రోడ్డులో బొలిశెట్టి మధు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా, వార్డు ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

48వ వార్డు కూరగాయల మార్కెట్‌లో మార్కెట్ అధ్యక్షుడు కాల్ రామ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాషా, యూసుఫ్ షరీఫ్, బొమ్మిడి అశోక్, శ్రీశైలం, అన్నపూర్ణమ్మ, జ్యోతి, కొండమ్మతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

27వ వార్డులో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కక్కిరేణి నాగయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. పల్స వెంకన్న, శబరి, కక్కిరేణి సత్యనారాయణ, రాపర్తి శ్రీను, మోహినుద్దీన్, రాపర్తి సైదులు, కక్కిరేణి ఆనంద్, తండు పరశురాం, రాపర్తి రవి, పిల్లలమర్రి రాజు, రాపర్తి రాము, బట్టు సైదులు, ఇండ్ల సురేష్, బైరు సాయి, రాపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

22వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి మోత్కూరు సందీప్ ఆధ్వర్యంలో వార్డు ప్రజల మధ్య కేక్ కటింగ్ నిర్వహించారు. టైసన్ శ్రీను, శ్రీనివాస్, బండర్ సతీష్, సుజాత, లక్ష్మి, సౌజన్య, అంజయ్య, దుర్గారావు, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు నల్లగుంట్ల అయోధ్య, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తలమల్ల హసేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గోవులకు పండ్లు తినిపించి జగదీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ లీగల్  సెల్ న్యాయవాదులు కాకి రాంరెడ్డి, గ్రంధి వెంకటేశ్వర్లు, కొంపెల్లి లింగయ్య బాణాల విజయ్ కుమార్, డప్పు మల్లయ్య మీసాల శీను రేగట్టి లింగయ్య గౌడ్ అనుములపూరి సైదులు రేగటి శంకరయ్య గౌడ్ పిట్టల వెంకటేశ్వర్లు తొగిటి మురళి అల్లంనేని వెంకటేశ్వరరావు గద్దల శ్రీను చిప్పలపల్లి చిరంజీవి హనుమాన్ చింతల నాగార్జున కొమ్మ రమేష్ జటంగి శ్రీనాథ్ నాగరాజు రత్నావత్  లూనావత్ ప్రేమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నాయకుడు పల్స వెంకన్న ఆధ్వర్యంలో అపూర్వ బధిరుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగదీశ్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు అంతటి విజయ్ కుమార్, రాపర్తి సైదులు, పరశురాం, రాపర్తి రామ్, రమేష్, సాయి, రషీద్, శ్రీను, కళ్యాణ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీతో పాటు 9వ వార్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగదీశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333