అడ్డగూడూరులో ఘనంగా మాజీమంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
అడ్డగూడూరు 19 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం అడ్డగూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జగదీశ్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,టౌన్ అధ్యక్షుడు నాగులపెల్లి దేవగిరి,మాజీ ఎంపీటీసీ పూలపల్లి జనార్దన్ రెడ్డి,సర్పంచ్ పూజారి వనజ–సైదులు,కోటమర్తి సర్పంచ్ పాశం విష్ణువర్ధన్ రావు,అడ్డగూడూరు ఉప సర్పంచ్ వరిగడ్డి లోకేష్, గూడేపు పరమేష్,పయ్యావుల రమేష్, కన్నబోయిన ఎలేందర్, ఆనందాచారి,జక్కుల యాదగిరి,మందుల కిరణ్, పొన్నాల నవీన్ కుమార్, నర్సిరెడ్డి,చిత్తలూరు నరేష్, మారోజు వెంకన్న,రేఖల ఇమ్మానియేల్,శీలం దావీద్, ఇరుగు లక్ష్మణ్,ఇటికాల కుమారస్వామి,చుక్క ప్రభాకర్,గుగ్గిళ్ల భరత్, అవిరెండ్ల యాదయ్య,చిలుక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.