ప్రతిభకు అంగవైకల్యం శాపమా
505 మార్కులు సాధించినా సీటు నిరాకరణ! పై తీవ్రంగా ఖండిస్తున్న GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్, కాకా శివశంకర వరప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన దివ్యాంగ విద్యార్థిని "కారం విద్యా శరణ్య" పదో తరగతిలో 505 మార్కులు సాధించి వైరా గిరిజన గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం సీటు సాధించింది. కానీ, కాలేజీ హాస్టల్‌లో దివ్యాంగులకు తగిన మౌలిక సదుపాయాలు లేవనే సాకుతో కాలేజీ ప్రిన్సిపాల్ మాధవి లత అడ్మిషన్ నిరాకరించడం అత్యంత దారుణం.
ప్రోత్సహించాల్సిన విద్య వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
ఇది స్పష్టంగా 'దివ్యాంగుల హక్కుల చట్టం (RPwD Act, 2016)' ఉల్లంఘించడమే!
కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ, కేవలం మాటల హామీలు కాకుండా విద్యా శరణ్యకు వెంటనే అధికారికంగా అడ్మిషన్ ఇచ్చి న్యాయం చేయాలని, బాధ్యులైన అధికారులపై విచారణ జరపాలని కోరుతున్నాం.
రేపు ITDA పిఓ గారి దగ్గరికి వెళ్లడం జరుగుతుంది అక్కడ అయిన ఆదివాసి బిడ్డకు న్యాయం తో పాటు చదువుకి భరోసా వస్తుందో లేదో చూడాలి
దయచేసి ఈ పోస్ట్‌ను గరిష్టంగా షేర్ చేసి విద్యా శరణ్యకు అండగా నిలబడండి! ????