అర్ధరాత్రి గడ్డివాములు దగ్ధం

May 24, 2026 - 08:39
 0  230
అర్ధరాత్రి గడ్డివాములు దగ్ధం

  తిరుమలగిరి 24 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఆదుకున్న మున్సిపల్ చైర్మన్ మరియు వార్డ్ కౌన్సిలర్... 

  అర్ధరాత్రి స్పందించిన అధికారులు.. తండ వాసులు కృతజ్ఞతలు... 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 9వార్డు.ఈదులపర్రె తండాలోని అర్థరాత్రి సమయంలో గుగులోతు భోజ్య. భుఖ్య సోమ్లా ఇరువురి రైతుల గడ్డివాము మరియు ఎడ్ల బండి పూర్తిగా కాలి బూడిద అయ్యాయి పశువులు, బర్లుకు తప్పిన ప్రమాదం. ఎలాంటి ప్రాణ హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు కాలిపోయిన గడ్డివాములు మరియు ఎడ్ల బండి విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు లబోదిబ అన్నారు నష్టపోయిన రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ ఆపదలో ఆదుకున్న మున్సిపాలిటీ చైర్మన్ రఘునందన్ రెడ్డి మరియు పదవ వార్డు కౌన్సిలర్ యాకుబ్ రాత్రి 2గంటలకు ఫోన్ చేసిన వెంటనే స్పందించి ఫైర్, మరియు పోలీస్, విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి ఆదుకున్నారు. అంత మధ్య రాత్రి స్పందించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు తండా ప్రజల తరుపున ధన్యవాదములు తెలిపారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి