అయోధ్యరామాలయంలో జరిగిన అక్రమాలతో

రాముని పరువు పోయిందనే దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్న రామభక్తులు

Jun 24, 2026 - 19:55
Jun 24, 2026 - 23:26
 0  10
అయోధ్యరామాలయంలో జరిగిన అక్రమాలతో

తెలంగాణ వార్త  జూన్ 24 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం ; త్రేతా యుగం నాటి చరిత్ర అనంతరం వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి. హిందుస్థాన్ గా ప్రఖ్యాతి చెందిన మన భారత దేశంలో మర్యాద పురుషోత్తము డైన శ్రీరామచంద్రుడు  జన్మించిన పుణ్యభూమిలో కోట్లాదిమంది ఆరాధించే శ్రీరాముని కి తాను జన్మించిన అయోధ్యలో ఆలయం లేకపోవడంతో కోట్లాదిమంది భారతీయులు ఆవేదన కు గురయ్యారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం పాదయాత్రలు, రథయాత్రలు, ఇంకా అనేక శాంతియుత ఉద్యమాలు జరిగాయి. ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానాల తీర్పులతో, దాతల, భక్తుల సహాయ సహకారాలతో అయోధ్యలో సర్వాంగ సుందరమైన దేవాలయ నిర్మాణం జరిగింది. దీంతో భారతీయులు ఆనందోత్సాహాలతో ఉత్సవాలు జరుపుకున్నారు. దేశం నలుమూలల నుండిలక్షలాదిమంది భక్తులు ప్రతినిత్యం అయోధ్య బాల రాముని దర్శనం చేసుకుంటున్నారు. తద్వారా ఆనంద తన్మయత్వం పొందుతున్నారు. ఆలయ నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఖర్చులు కాగా, సందట్లో సడేమియాగా కొద్దిమంది అవినీతి జలగలు కోట్లాది రూపాయలు ప్రక్కదారి పట్టించినట్లు విమర్శలు కూడా వస్తున్నాయి, అవినీతిపరుల అక్రమాల వల్ల అయోధ్యరాముని పరువు పోతో0దని, నాస్తిక, హేతువాదు లు, కుహానా లౌకిక వాదులు ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, భద్రాద్రి రామభక్తులు తెలిపారు. నేరస్తులకుశిక్షలు పడితే ఆనేరాలు చేసిన వాళ్ళకే పాపం అంటుంది కానీ న్యాయస్థానాలకు ఏ విధమైన సంబంధo ఉండనట్లే, అయోధ్యలో జరిగిన ఆర్థికఅక్రమాలకు శ్రీరాముని పై నిందలు వేస్తున్న కొన్ని మీడియా సంస్థలు  మరియు సోషల్ మీడియా సంస్థల ప్రసారాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామ భక్తులు తెలియజేశారు. అయోధ్యలో జరిగిన ఆర్థిక అక్రమాలపై సమగ్ర విచారణకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఉన్నతమైన కమిటీని కూడా నియమించి విచారణకు సమయం కూడా కేటాయించారని, ఆ విచారణలో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని రామభక్తులు కోరుతున్నారు. వచ్చే యాడాది ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా, రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రాబల్యం కోసం మర్యాదా పురుషోత్తముడైన అయోధ్య రాముని ఆలయం విషయంలో రాజకీయ పార్టీలు సంయంనంతో వ్యవహరిస్తే మంచిదని ప్రజలు కోరుతున్నారు. 
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333