సేవకు హద్దు లేదు

జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలంలోని మాన్ దొడ్డి గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శాంతినగర్ వాసి షేక్ అస్లాం షరీఫ్ గారు తన తండ్రి షేక్ ఖాదర్ షరీఫ్ 29వ వర్ధంతి సందర్భంగా పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాన్ దొడ్డి ప్రధానోపాధ్యాయులు హరున్ రషీద్ సార్ మాట్లాడుతూ "సేవకు హద్దు లేదు అని,సేవ చేసే గుణం అందరికీ ఉండదు అని తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విద్యార్థిని ,విద్యార్థులకు అస్లాం ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు గ్రామంలోని రెండు ప్రాథమిక పాఠశాల ల విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు ప్రధానం చేశారు అలాగే పాఠశాలకు అవసరమైన సామాగ్రిని కూడా ఇచ్చారు. అస్లాం గారు ఈ సందర్భంగా పలువురుని సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం షేక్ అస్లాం షరీఫ్ గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హరున్ రషీద్ సార్ ఉపాధ్యాయ బృందం మరియు హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఖలీల్, రంగస్వామి, సురేష్, యుగంధర్ మైబు పాల్గొన్నారు.