అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి
మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు.
ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో కాకుండా, సాధారణ ఫోన్ల ద్వారా కూడా టి సేఫ్ పనిచేస్తోంది. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా ఈ యాప్ ను అభినందిస్తూ హీరో మాధవన్ టి సేఫ్ ప్రచార వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కోల్ కత్తా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టి సేఫ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది. టి సేఫ్ యాప్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందు కొచ్చాయి
ఇతర రాష్ట్రాలకు టి సేఫ్ యాప్ ఆదర్శంగా మారటం, ప్రముఖ హీరో మాధవన్ తన ట్విట్టర్ అకౌంట్లో టి సేఫ్ వీడియో ను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయిలు మహిళలు ఈ యాప్ ను వినియోగించాలనీ సూచించారు. మరింతగా ఈ యాప్ ను విన్యాయంలోకి తేవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.