అభ్యుదయ వాదులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఎందుకు ?

Mar 30, 2024 - 23:17
 0  1

గత ప్రభుత్వంలో ధగాపడ్డ  తెలంగాణ పరిస్థితి తెలిసి కూడా  అతిగా హామీలు ఇవ్వడం కారణమా ?

 విధానపరమైన నిర్ణయాలు ఇప్పటికీ  ప్రకటించకపోవడం పైన సున్నిత విమర్శలు.

 మిత, అతివాద మేధావులను కూడా  కలుపుకు పోవాలి.

--  వడ్డేపల్లి  మల్లేశం  

గత పదేళ్లుగా రాష్ట్రంలో సాగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని  తొలి నాలుగు సంవత్సరాలు ప్రశ్నించకపోయినా  ఆ పార్టీ గమ్యాన్ని గమనాన్ని నిర్ధారించుకున్న అభ్యుదయవాదులు మేధావులు ప్రతిపక్షాలు  2018 నుండి విమర్శించడం ప్రశ్నించడం ప్రారంభమైనది.  తొలి  టర్మ్ లో  సెంటిమెంట్ పేరుతో   నెట్టుకు వచ్చిన ప్రభుత్వం 2018 లో జరిగిన ఎన్నికల సందర్భంగా అఖిలపక్షాలకు ప్రాధాన్యత ఇస్తామని , పొరపాట్లను సవరించుకుంటామని, ప్రజల పక్షాన పని చేస్తామని,  ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని,  మిగిలిపోయిన హామీలను నెరవేర్చుతామని  నమ్మబలికి రెండవసారి అధికారానికి వచ్చినప్పటికీ  రుణమాఫీలోనూ, రైతుబంధులోనూ, పెట్టుబడిదారీ వర్గానికి వంతపాది పేద కుటుంబాలకు చేసిన ద్రోహం అంతా కాదు. పైగా   రైతుబంధు పేరుతో  పండని భూములు, భూస్వాములకు అప్పనంగా కట్టబెట్టి 30 వేల కోట్ల రూపాయల  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.  కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రతి నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడిన ప్రభుత్వం  రాజకీయ ఉద్యోగ వర్గాలలో కూడా అవినీతి పెచ్చు మీరిన పట్టించుకోకుండా  విద్యా వైద్యం మీద ఏనాడు సమీక్షించకుండా దాటవేత ధోరణితో అవలంబించడం వలన ఇటీవల   గత ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.  అంతులేని హామీలను ఇచ్చి విఫలమైనటువంటి టిఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ప్రజల మనసులను గెలవడానికి  అనివార్యంగా తా యిలాలు ఉచి తాలను ప్రకటించడం,  కొద్దికాలంలోనే పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం వలన  ప్రతిపక్షం వెంటనే విమర్శించడానికి అవకాశం ఏర్పడింది . అంతేకాదు రాష్ట్ర ఖజానాలో  నీ ల్ బ్యాలెన్స్ అని తెలిసిన  100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ఇచ్చిన ప్రకటన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే.  ఇదే సందర్భంలో అభ్యుదయ వాదు లు మితవాద అథీ వాద విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్లు ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా ప్రారంభమైనది. పేరుకు పౌర ప్రజాసంఘాలతో ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినప్పటికీ  విధానపరమైన ప్రకటనలు చేయకపోవడం వలన ప్రభుత్వం  కొంతమంది దృష్టిలో  విమర్శకు గురి కావడాన్ని పరిశీలించవలసిన అవసరం ఉన్నది  .

       ప్రధానమైన విమర్శలు ఏమిటి  :-

----------------++----

తెలంగాణ ఉద్యమకారుల  వేదిక, జాగోతెలంగాన,నిరుద్యోగ ఐక్యవేదిక  పేరుతో పని చేస్తున్నటువంటి జర్నలిస్టులు కవులు రచయితలు ప్రొఫెసర్లు  తెలంగాణ అస్తిత్వాన్ని పదేళ్ల తర్వాత కూడా వెతుక్కోవాల్సి వచ్చిందని ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సందర్భంలో మళ్లీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం  మూస పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తే సాధ్యం కాదని  సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తూనే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సాహిత్య సంస్కృతిక రంగాలను పునరుజ్జీ వింప చేయాలని సూచన చేయడం ఆ వైపుగా ప్రభుత్వాన్ని విమర్శించడాన్నీ మనం గమనించవచ్చు.  కొద్దిమంది మితవాద మేధావులతో ఇటీవల పౌర సంఘాల పేరుతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అందులో  అతివాదులుగా  ప్రభుత్వం యొక్క మనుగడ విధానాలను ప్రశ్నిస్తున్న వారు పాల్గొనక పోవడం వలన కూడా ఈ వెలితి ఏర్పడుతున్నది.  విలేకరుల సమావేశంలో ప్రశ్నించినప్పుడు ప్రొఫెసర్లు మేధావులు  ఈ ప్రభుత్వానికి ఒక విధానం రూపకల్పన అంటూ లేదని  పరిశ్రమలు, విద్య, వైద్యము, న్యాయము,  వయోజన విధానము,  ఆహార భద్రత ,పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు ,ఉద్యోగ విధానాల పట్ల  స్పష్టమైన విధానాన్ని ప్రకటించకుండానే కేవలం 100 రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పడం అంటే  తాత్కాలికంగా  అభివృద్ధిని పక్కకు పెట్టినట్లే  అని వాదిస్తున్నారు . గత పాలనలో విద్య వైద్యము  పారిశ్రామిక విధానము  వ్యవసాయ  రైతాంగ పరిస్థితులు  రైతుబంధు దళిత బంధు వంటి అనేక పథకాలు కూడా పెట్టుబడిదారులకు మాత్రమే పని చేసిన విధానాన్ని  ఖండిస్తున్నారు .అదే సందర్భంలో కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపాన్ని సవరించడంతోపాటు ప్రాజెక్టులలో నీళ్లు నింపి కరువును కట్టడి చేయాలని కూడా సూచన చేస్తూ వెంటనే వి దానపరమైన ప్రకటన చేయకపోవడం పట్ల ప్రభుత్వాన్ని విమర్శించడం ఆలోచించ తగినది.  .విద్యారంగం బ్రష్టు పట్టిపోయింది, అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడినవి, విశ్వవిద్యాలయ విద్య నాశనం అయిపోయింది,  బోధన బోధనేతర సిబ్బంది ఖాళీలు భర్తీ చేయకుండా అలానే ఉన్నాయి . సర్వత్రా అవినీతి రాజమేలుతున్న ది వివిధ  విభాగాలను ప్రక్షాళన చేయడానికి నిధులు లేవని తెలుసు అయినప్పటికీ హామీలు ఇవ్వడంలోని అంతరార్థ ఏమిటి ?దానికి ప్రజలకు సంబంధం ఉందా?  అని అభ్యుదయవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  సంపదను ఉత్పత్తి చేసి సంపదను ప్రజలకు పంపిణీ చేసే క్రమంలో విధానపరమైన నిర్ణయాలను తీసుకున్నప్పుడు మాత్రమే ఒక ప్రభుత్వాన్ని అంచనా వేయగాలుగుతారని  ఇప్పటివరకు ప్రభుత్వo   విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడాన్ని  బుద్ధి జీవులు తప్పుపడుతున్నారు  .అంతేకాకుండా భాష,  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం , తరచుగా ఢిల్లీ కి ప్రధానమంత్రి అంశాల పైన  విశ్లేషకులు విమర్శకులు బుద్ధి జీవుల  ఆరోపణలతో పాటు  ఏ లక్ష్యం కోసం అయితే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దించి కాంగ్రెసును ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకున్నారో ఆ లక్ష సాధనలో  ప్రభుత్వం  కృషి చేయడం లేదు అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నవి. దీనికి ప్రభుత్వం  తెలంగాణ ఉద్యమకారులు మేధావులు విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు  మానవ పౌర హక్కులు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి  సరైన రీతిలో స్పందించి సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉన్నది.  నిధులు లేక  ఖాజా నా ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తన విధానాన్ని  దాటవేసే ధోరణితో అవలంబించడాన్ని  మేధావులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పైగా గత ప్రభుత్వ అవినీతిపైన ముమ్మరమైన దర్యాప్తు జరిపించడంలో రాజీ పడే ధోరణిని కూడా  విమర్శిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించడం  గమనించ తగిన విషయం .

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333