అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లు పూర్తి చేయించుట

Aug 5, 2024 - 21:30
Aug 21, 2024 - 21:19
 0  27
అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లు పూర్తి చేయించుట

గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై మంత్రివర్యులు మరియు గౌరవ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి నమస్కరించి వ్రాయునది 
విషయం :  65వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న మా మునగాల పిహెచ్సి సెంటర్ ను అప్డేట్ చేసి 24 గంటల వైద్యశాల అందించడం దానిలో పోస్టుమార్టం సౌకర్యం కల్పించడం తో పాటు  108 సౌకర్యం కల్పించి, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి పరిధిలో ఉన్న మసీదు ముందర అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లు పూర్తి చేయించుట గురించి...
 ఆర్యా...
 మా మునగాల గ్రామం నేషనల్ హైవే పై ఉంది మండల పరిధిలో తరచూ ఎక్కడో ఒకచోట రోజువారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అనేకమంది మృత్యువాత  పడుతుండటంతో పాటు క్షతగాత్రులుగా అవుతున్న విషయం మీకు తెలిసిందే. అయినప్పటికీ మా మునగాల లో గతంలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిగా ఉండగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం దానిని  పిహెచ్సి సెంటర్ గా  మార్చివేసింది. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకే హాస్పిటల్ తెరుస్తూ సిబ్బంది బంద్ చేస్తూ వెళ్తున్నారు. ఈ తరణలో పేదలకు తర్వాత రోజువారి రహదారిపై ప్రమాదాలు జరిగితే తక్షణం వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాల జరగాలని కోదాడ, సూర్యపేట ఆసుపత్రికి క్షతగాత్రులను, ప్రమాదంలో మరణించిన వారి శవాలను పోస్టుమార్టం చికిత్స నిమిత్తం అక్కడి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సమయం దాటిపోవడంతో అనేకమంది గాయపడిన వారు చనిపోతున్నారు. ఆ చనిపోయిన వారి శవాలను కూడా సూర్యాపేట, కోదాడ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించాల్సిన పరిస్థితితో బాధిత కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విషయం హైదరాబాదులో తమను కలిసి తర్వాత మా ఎమ్మెల్యే గారైన పద్మావతి రెడ్డి గారికి మునగాల మండల పరిషత్ సమావేశంలో సౌకర్యాలు కల్పించాలని కోరడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. కనీసం మునగాల లో ఉన్న 108 సౌకర్యం కూడా పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయం కూడా తమ దృష్టికి తెచ్చాం అయినా పరిష్కారం కాలేదు. ప్రజా శ్రేయస్సు కోసం, పేదల సౌకర్యార్థం ఈ సమస్యలు పరిష్కరించాలని మండల ప్రజలు మునగాల గ్రామస్తుల తరపున కోరుతున్నాను. సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ..
 భవదీయ 
మీ శ్రేయోభిలాషి
సైదులు అలియాస్ గంధం సైదులు
 సీనియర్ జర్నలిస్టు
 సామాజిక కార్యకర్త 
మునగాల

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State