ప్రతి ఒక్కరు లేబర్ కార్డు తీసుకోవాలి.

సూర్యాపేట 22 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వ అందజేసే లేబర్ కార్డు తీసుకోవాలని డివిజన్ తాపీ పనివారుల సంఘం సూర్యాపేట అధ్యక్షుడు* వల్దాస్ శీను* ( రెబల్ శీను) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భావన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డుతో పాటు సంఘ ఐడి కార్డులు తీసుకున్నట్లయితే ఏ చిన్న ప్రమాదం జరిగిన ప్రభుత్వంతో పాటు సంఘం కూడా ఆదుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వానికి అండగా మనమంతా ఐక్యంగా ఉండాలన్నారు.
భావన నిర్మాణ కార్మికులకు సమస్య ఉన్న కలిసి చర్చించుకొని పరిష్కరించుకుందామని సూచించారు. పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినట్లయితే సంఘం తరఫున ఆర్థికంగా సహాయం చేయడానికి కృషి చేస్తున్నామని ఇదంతా సాధ్యపడాలంటే ప్రతి ఒక్కరు సంఘ ఐడి కార్డు తప్పక తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గుత్తి నగేష్, ప్రధాన కార్యదర్శి కోట శ్రవణ్, ఉపాధ్యక్షుడు ఇరుగు దిండ్ల అంజయ్య ,సహాయ కార్యదర్శి కుంచం రవి ,కోశాధికారి పోల గాని బిక్షం గౌడ్, ఆర్గనైజర్ వంగూరి డానియల్ ,నామ సైదులు ,గోనె నాగయ్య ,మల్లెల నర్సిరెడ్డి ,మామిడి గౌరయ్య, జానీ పాషా, పడిదల శ్రీను ,వబ్బపెల్లి నరసింహ, శ్రీనివాస్ రెడ్డి ,కొండయ్య, వెంకటరెడ్డి ,రవికుమార్, శ్రీను పాల్గొన్నారు