కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేద్దాం

Feb 16, 2024 - 19:53
 0  13
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేద్దాం
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేద్దాం

AITUC జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు.


బీజేపీ కేంద్ర ప్రభుత్వ మతోన్మాద కార్పోరేట్ విధానాలపై కార్మికులు కన్నెర్ర చేయాలి.

AITUC -CITU -IFTU  కార్మిక సంఘాల పిలుపు.

జోగులాంబ గద్వాల ఫిబ్రవరి 16 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె మరియు గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని నల్లకుంట రాజీవ్ మార్గ్ పాత బస్టాండ్ తీరుమైదన్ నుండి గాంధీ చౌక్ వైయస్సార్ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌకుదాక ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిAITUC జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు,సిఐటియు జిల్లా కార్యదర్శి వివి నరసింహ,ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఉప్పేరు కృష్ణ మాట్లాడారు దేశంలో పదేళ్లనుండి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం  60 శాతం అసంఘటిత రంగం సేవారంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం తమ శ్రమ ద్వారా సంపాదనను సృష్టిస్తున్నారని కాని మరోపక్క భారతదేశం వ్యవసాయ రంగంపై సుమారు 70 శాతం ఆధారపడినటువంటి సందర్బంఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం కార్మికులు రైతులు వ్యవసాయ కూలీల పట్ల ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు వారి ఆర్థిక సామాజిక స్థితిగతుల కొరకు ప్రయత్నం చేయలేదని పోగా దేశంలో చిన్న సన్నకార్ రైతులు 80 శాతం ఉన్నారని రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయం పండగ చేస్తామని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగడ్బాల్ పలికి వ్యవసాయని సంక్షోభంలోకి నెట్టి రైతంగాని భూముల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుందని గిట్టుబాటు మద్దతు ధర చట్టం చేయాలని రైతులు పోరాటం చేస్తుంటే వారిపై పోలీసులను పెట్టి లాఠీలతో దాడి చేస్తుందని గ్రామీణ ప్రాంతంలోని కూలీలకు ఉపాధి చట్టాన్ని పకడ్బందీగాఅమలు చేసి నిధులు పెంచాల్సింది పోయి నిర్వీర్యం చేస్తుందని దేశంలో ధరలు నిత్యవసర వస్తువులు పెట్రోలు డీజీలు వంట గ్యాస్ ఇతర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల మీద భారాల మోపుతుందని ఇంకోపక్క దేశంలో ఉన్న సంపదను వనరులను ఖనిజ సంపదను అడవి సంపదను ఈ దేశం నుండి పెట్టుబడుదారులకు బడ బురుజువాలకు దోచిపెడుతుందని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న కార్మిక వర్గానికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ ఇతర సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తే దాడులు చేస్తుందని రెండో పక్క ప్రభుత్వ రంగ సంస్థలను రైల్లో ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ బొగ్గు గనులు ఓడరేవులు విమానాలు విద్యుత్తు రోడ్డు మార్గాలు తదితర సంస్థలను ప్రైవేటు వ్యక్తుల కట్టబెడుతుందని కారుచౌకగా దేశంలో ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగ కల్పన కల్పిస్తామని మాటలు చెప్పి నిరుద్యోగ వ్యవస్థను తారస్థాయికి చేసిందని ప్రశ్నించే వ్యక్తులపైన ప్రజాస్వామ్య వాదుల పైన దేశద్రోహం పేరు మీద కేసులు పెట్టి జైలుకు పంపుతుందని రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తుందని భారత రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని పౌర స్వేచ్ఛను లేకుండా చేస్తుందని కార్మిక చట్టాలను కోడులుగా మార్చి కార్మిక వర్గానికి బానిసలు చేస్తుందని మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని వీటన్నిటిమీద పోరాడుతున్న వ్యక్తుల పైన సంఘాల పైన అక్రమ కేసులు పెడుతుందని మతం పేరు మీద జాతీయ భవాల పేరుమీద  ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని రాబోయే భవిష్యత్తులో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ఐక్య ఉద్యమాలతోటి నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లొ ఎఐటియుసి నాయకులు ఆశన్న, anm నాయకురాలు పద్మ, AISF కార్యదర్శి ప్రవీణ్ AITUC హమాలీ నాయకులు నాగరాజు రాజు,పరుశరామ్,కర్రెప్ప,రవి. మస్తాన్, వెంకట్రాములు.సీఐటీయూ నాయకులు డ్యాం అంజి వి గట్టన్న వెంకటేశం సీతారాములు పద్మకాంతమ్మ బాలుఐ ఎఫ్ టి యు నాయకులు జమ్మిచెడి కార్తీకు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333