అంబేద్కర్ యూత్ సేవలు అభినందనీయం
సూర్యాపేట, 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రం కుడ కుడ కు చెందిన అంబేద్కర్ యూత్ వారి ప్రజా సేవలు అభినందనీయమని రెండో వార్డ్ కౌన్సిలర్ తన్వీర్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గునగంటి వంశీలు అన్నారు. ఈరోజు పట్టణ కేంద్రం కూడా లో లక్కపాక ప్రణీత్ మహాజన్ జ్ఞాపకార్థం అంబేద్కర్ యువజన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు. యువకులు నేడు డ్రగ్స్ , గంజాయి వంటి మత్తు పదార్థా లకు దూరంగా ఉండాలని నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటే సామాజిక దురాచారాలకు దూరంగా ఉండవచ్చునని నిరంతరం ప్రజాసేవలో ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ నాయకులు కిషోర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు