చిన్నమారు ఇరిగేషన్ లిఫ్ట్ ట్రాన్స్ ఫారం లో కాపర్ వైర్ చోరీ

Jul 15, 2026 - 19:26
Jul 15, 2026 - 19:38
 0  1
చిన్నమారు ఇరిగేషన్ లిఫ్ట్ ట్రాన్స్ ఫారం లో కాపర్ వైర్ చోరీ

 15 -07-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన చిన్నమారు ఇరిగేషన్ లిఫ్ట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ వైర్ల చోరీ...

చిన్నంబావి మండలం పెద్దమారూర్ గ్రామ సమీపంలో జరిగిన ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నమారూర్ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు చెందిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో గుర్తుతెలియని దుండగులు కాపర్‌ వైర్లను చోరీ చేయడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఆయిల్‌ను బయటకు వదిలేశారు. దీంతో సుమారు రూ.14 లక్షల నష్టం జరిగినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.ఈ ఘటనతో సుమారు 8 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై ప్రభావం పడనుంది. సమాచారం అందుకున్న ఇరిగేషన్‌ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో ఇది మూడోసారి చోరీ జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంఘటన స్థల పరిశీలనలో వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాషువా, ఇరిగేషన్ శాఖ అధికారి కవిత లైన్‌మెన్ ఈశ్వరయ్య, నరేష్, లిఫ్ట్ సిబ్బంది సాయి, రాము, తిరుపతి, లష్కర్లు వెంకటేశ్వర్లు, శ్యాంసుందర్ రెడ్డి, బాలయ్య, ఆంజనేయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State