అంగన్వాడీ టీచర్ హెల్పర్లను ఉత్తి చేతులతో బయటకు పంపిస్తే ఊరుకునేది లేదని

Jul 15, 2024 - 19:41
 0  3
అంగన్వాడీ టీచర్ హెల్పర్లను ఉత్తి చేతులతో బయటకు పంపిస్తే ఊరుకునేది లేదని

జీవో నెంబర్ 10రద్దుచేసి. 18 వేల రూపాయలు జీతం అమలు చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా

 ముఖ్యమంత్రితో మాట్లాడతా ఎమ్మెల్యే పాయం

 అంగన్వాడి టీచర్ హెల్పర్ పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం-CITUజిల్లా ఉపాధ్యక్షులు ఎంవి అప్పారావు

జూలై 15 మణుగూరు తెలంగాణ వార్త:- సీఐటీయూ మణుగూరు బూర్గంపాడు  ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో  మణుగూరు కేంద్రంగా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిర్వహించారు వందలాది మందితో ధర నిర్వహించారు. ఈ ధర్నాకు సభాధ్యక్షులుగా  సత్ర పల్లి సాంబశివరావు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వి అప్పారావు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి టీచర్లు వెలపల్లి సమస్యలు పరిష్కారం కోసం  ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ముందు  ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ఎక్కువ మంది కార్మికుల హాజరు కావడం  అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అన్ని పనులకు వాడుకుంటూ  వారి జీతాల పట్ల వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో పట్ల  ఏ మాత్రం శ్రద్ధ చూపించడం లేదని. అదేకాక  జీవో నెంబర్ 10 రద్దు చేయాలని . రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కి రెండు లక్షలు  తెలపరకు లక్ష పెంచి  టిఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని  కనీస వేతనం 18000 అమలు చేయాలని ఈఎస్ఐ  పిఎఫ్  ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించి పిఆర్సి ప్రకారం ఐదు శాతం అయ్యారని వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆరోగ్య లక్ష్మి. అంగన్వాడి ఉద్యోగులకు ఆసరా కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలని పై20 డిమాండ్లతో కూడిన  వినతి పత్రాన్ని స్థానిక పినపాక  ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి హెల్పర్ల సమస్యలు  రాష్ట్రవ్యాప్తంగా మోడీ కేంద్రంతో ముడిపడి ఉన్నాయని  సమస్యలు పరిష్కారం కోసం మంత్రి సీతక్కని. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి  విశాఖలో ప్రధాన కార్యదర్శి  నా లెటర్ ప్యాడ్ తో. పంపిస్తానని తెలియజేస్తూ అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమస్యలు పరిష్కరించని ఎడల  కార్మికుల ఆధ్వర్యంలో సీఐటీయూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని  అప్పారావు  అన్నారు
ఈ కార్యక్రమంలో. సీఐటీయూ సింగరేణి రాష్ట్ర కమిటీ సభ్యులు.నెల్లూరు నాగేశ్వరరావు. జిల్లా ఉపాధ్యక్షులు  గద్దల శ్రీనివాసరావు.జిల్లా నాయకులు. సత్ర పల్లి సాంబశివరావు. అంగన్వాడి జిల్లా నాయకురాలు. పి హేమలత. Kసావిత్రి. హేమలత. అనుసు రయ్య. భవాని. ప్రమీల. సుజాత. నాగమణి. సావిత్రిహెల్పర్. మల్లీశ్వరి. యశోద.రమణ.నాగమణి. సులోచన లీల జమునిషా  విజయ మరి కొంతమంది పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333