భారీ వర్షం వందల ఎకరాల్లో పంట నష్టం 

Sep 2, 2024 - 18:33
Sep 2, 2024 - 19:03
 0  1
భారీ వర్షం వందల ఎకరాల్లో పంట నష్టం 

నీట మునిగిన పంటలు కోతకు గురైన పంట క్షేత్రాలు 
తెలంగాణ వార్త సెప్టెంబర్ 02 మహబూబాద్ జిల్లా 
 రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి మండలంలో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మండల రైతులు తెలిపారు. మండలంలోని కుమ్మరి కుంట్ల, గ్రామాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరి నిత్యవసర సరుకులు తడిసినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. రెండు రోజుల నుంచి భారీ వర్షం కురవడంతో మండలంలోని వందనం ఎకరాల్లో తలమడుగు దొర్లి  పత్తి, వరి, పసుపు, పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అదేవిధంగా పంట చేనులో నుంచి వర్షం నీరు పారడంతో నేలకోతకు గురికాగా పంటలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయనీ రైతులు తెలిపారు. నేలలు కోతకు గురికాగా తిరిగి పంటలు వేసేందుకు కూడా పనికి రాకుండా పోయాయని తమ ఆవేదన ను వ్యక్తం చేశారు. మండలంలో వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ, సర్వేలు నిర్వహించి భారీ నష్టంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు
పంట పొలాలను పరిశీలించిన: ఏ ఈ ఓదీక్షిత్ 
రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన మండల కేంద్రంతోపాటు గున్నపల్లి, కుమ్మరి కుంట్ల, పెద్ద ముప్పారం, తూర్పు తండా, గ్రామాలలో సోమవారం పర్యటించి 250 ఎకరాల్లో వరి పంట, 50 ఎకరాలకు పైగా పత్తి పంట, నీట మునిగినట్టు  ప్రాథమికంగా సమాచారాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333