ZPHS ఆత్మకూర్ లో లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ రెన్నోవేషన్ గదుల ప్రారంభం

Jan 27, 2026 - 20:44
Jan 28, 2026 - 13:28
 0  1
ZPHS ఆత్మకూర్ లో లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ రెన్నోవేషన్ గదుల ప్రారంభం

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ ZPHS ఆత్మకూర్ లో లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ రెన్నోవేషన్ గదుల ప్రారంభం ఆత్మకూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS ఆత్మకూర్) నందు విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్‌ను వేర్వేరు గదుల్లో ఏర్పాటు చేయడం కోసం చేపట్టిన రెన్నోవేషన్ పనులు పూర్తయ్యాయి. గ్రామానికి చెందిన దాతలు శ్రీ పందిరి మాధవ రెడ్డి గారు మరియు శ్రీ పృద్విధర్ రెడ్డి గార్లు పాఠశాలలో వాడానుటు స్థితిలో ఉన్న, మరమ్మతులు అవసరమైన రెండు గదులను గుర్తించి, సుమారు రూ.50,000/- వ్యయంతో వాటిని రిపేర్ చేయించి ఒక గదిని లైబ్రరీగా, మరొక గదిని సైన్స్ ల్యాబ్‌గా అభివృద్ధి చేశారు. ఈ నూతనంగా అభివృద్ధి చేసిన లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ గదుల ప్రారంభ కార్యక్రమం ఈ రోజు ప్రధానోపాధ్యాయులు శ్రీ ఓరుగంటి శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల రెవెన్యూ అధికారి (MRO) శ్రీ అమీన్ సింగ్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీ కాటయ్య గారు, మండల విద్యాశాఖ అధికారి (MEO) శ్రీ ధార సింగ్ గారు, ఉప సర్పంచ్ శ్రీ సంతోష్ గారు, గ్రామ పెద్దలు శ్రీ కృపాకర్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ శ్రీ వీరా రెడ్డి గారు తదితరులు పాల్గొని గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో కీలకమని పేర్కొని, లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ వసతులు విద్యార్థుల విద్యా ప్రగతికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి విశేష సహకారం అందించిన దాతలైన శ్రీ పందిరి మాధవ రెడ్డి గారు మరియు శ్రీ పృద్విధర్ రెడ్డి గార్లను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.