ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం స్పందించడానికి స్వాగతిస్తున్నాం.....
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పడిదల రవికుమార్ మాదిగ
సూర్యాపేట టౌన్ ..
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడానికి ఎమ్మార్పీఎస్ స్వాగతిస్తుందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ,జిల్లా ఇన్చార్జి పడి దల రవికుమార్ మాదిగ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేశామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలుపరచడంలో ముందు వరుసలో ఉంటామని ప్రకటించడాన్ని మాదిగ కులస్తులంతా రుణపడి ఉంటామని తెలిపారు. చెప్పు డప్పు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4000పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని, రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ద కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి మాదిగ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతామని అన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరికంటి అంబేద్కర్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కానుక జానయ్య మాదిగ ,నాగరాజు ,వినోద్ ,ఉపేందర్, సైదులు ,పలువురు పాల్గొన్నారు