మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహయం అందించిన స్నేహితులు

Feb 1, 2026 - 17:41
Feb 1, 2026 - 18:36
 0  108
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహయం అందించిన స్నేహితులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహయం మండల పరిధిలోని ఏపూరి గ్రామానికి చెందిన భానోత్ రాజేందర్ అనే మిత్రుడు ఇటీవల కాలంలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది. కుటుంబానికి అండగా ఉండాల్సిన రాజేందర్ మృతి చెందటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడడంతో చిన్నప్పటినుండి కలిసి చదువుకునే విద్యార్థులు కలిసి ఆ కుటుంబానికి 40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఏపూరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-02 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆర్థిక సహాయాన్ని అందించారు. రాజేందర్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, రవీందర్,శ్రీకాంత్, తాజోద్దీన్ విక్రమ్ నరేందర్ రవి గోపాల్ వెంకన్న రామారావు ప్రభాకర్ బిక్షం కవిత నీలమ్మ సైదులు లాల్య తదితరులు పాల్గొన్నారు