76 గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇట్టి కార్యక్రమానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకల అనంతరం చిన్నారులు ఆట పాటలతోటి, మరియు నాలుగవ తరగతి 5వ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఇంగ్లీషులో స్పీచ్ లు ఇచ్చి గ్రామస్తులను అబ్బరపరిచారు. ఉపాధ్యాయులు కూడా ఆట పాటలో గెలుపొందిన విద్యార్థిని,విద్యార్థులకు గ్రామస్తులతో బహుమతులను అందించినారు.
విద్యార్థుల యొక్క ప్రతిభను చూసిన ఎండి మక్బూల్ పాషా, రెండు మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకుపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నాడు.
అదేవిధంగా ఈసారి ఎండి ఖలీల్ భాషా విద్యార్థుల ప్రతిభను చూసి విద్యార్థులకు ఫ్యాడ్లను బహుమతిగా అందించాడు .
గ్రామస్తులు ఎండి మక్బూల్ పాషా మాట్లాడుతూ విద్యార్థులారా మీరు విద్యలో ఇంకా ఎక్కువగా ప్రతిభను చూపిస్తే మేము కూడా మీకు మా శ్రేయ శక్తుల మేరకు మీకు అవసరమైనటువంటి బుక్స్, అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది.
ఆర్ఎంపీల జిల్లా సభ్యుడు లక్ష్మోజి మాట్లాడుతూ విద్యార్థులారా స్కూల్లో విద్యార్థులు తక్కువగా ఉన్న మీరు కనిపరిచే ప్రతిభను చూసి మేము చాలా సంతోషపడుతున్నాము. నేను కూడా నెక్స్ట్ జెండా వందనానికి మీరు ఇదే ప్రతిభను కనబరిస్తే నేను కూడా మీకు అవసరమైనటువంటి మెటీరియల్స్ ను నేను బహుమతిగా అందిస్తానని చెప్పడం జరిగింది.
జూపల్లి అనుచరుడు యువ నాయకుడు యంగ్ డైనమిక్ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ మేము విద్యార్థులు ఈ విధమైన ప్రతిభను కనబరుస్తారని మేము ఊహించలేదు. ఇంత ప్రతిభ కనపరుస్తున్న మా గ్రామ విద్యార్థులకు మేము కచ్చితంగా ఈ స్కూల్ కు కావలసిన వసతులు మొత్తాన్ని కూడా జూపల్లి కృష్ణారావు తో మాట్లాడి, ఈ స్కూలుకు కావలసినటువంటి కాంపౌండ్, గ్రౌండ్, కంప్యూటర్, విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలు,టేబుల్స్ ఇంకా ఏమైనా ఉంటే కూడా మేము జూపల్లి గారి దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా ఈ వసతులు మొత్తం కలిపిస్తాము అని మాట ఇవ్వడం జరిగింది.
చివరిగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ
గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక
76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వతంత్ర భారతదేశం లోని పౌరులందరికి
స్వేచ్చా, సమానత్వం, సమన్యాయం, సమాన వ్యక్తీ గౌరవం ను మరియు భారతీయుల మధ్యన ఐక్యతను కలిగించి సుపరిపాలన చేసుకునేందుకు దిశానిర్దేశం చేసిన దినం.
ఆర్ధిక సాంఘిక పారిశ్రామిక రాజకీయ
ప్రగతికి సోపాన పథమై సమాన
పౌరహక్కుల స్వేచ్ఛా విహంగమై ప్రపంచ
మేధావి మరియు భారత
రాజ్యాంగ రచనా నిర్మాణ రూపకర్త బాబాసాహేబ్ డాక్టర్ భీంరావు అంబేడ్కర్
కృషి ఫలితమే నేటి
భారత రాజ్యాంగపు అవతరణ జన్మదినం. మన భారతదేశం. స్వతంత్ర,సర్వసత్తాక,
సామ్యవాద,గణతంత్ర, లౌకిక రాజ్యమై వెలసిన సుదినం. స్వతంత్ర పరిపాలనాదిశగా
అడుగులు వేసిన గొప్పదినం.
ఇతర దేశాలకు ఆదర్శమై
మనమందరం దేశ రాజ్యాంగపు విలువను,
మహోన్నత భారత ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని పెంపొందించుదాం. అని కొనియాడారు.
ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్, గ్రామ దేవాదాయ కమిటీ అధ్యక్షులు క్యాథూరి రాముడు, సింగోటం బాలస్వామి, రోడ్డ కురుమయ్య, అవ్వల్ల వెంకటస్వామి,సుధాకర్ నాయుడు, డాక్టర్ లక్ష్మాజి, కంభం వెంకటేష్ శెట్టి,ఎండి మక్బూల్ భాష, మేకల గోపాల్, ఎండి ఖలీల్ భాషా, టైలర్ కృష్ణయ్య,రాఘవేంద్ర శెట్టి, మేకల సతీష్ యాదవ్ గ్రామ యువకులుు అధికక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.