నాలుగో తరగతి ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేస్తా.
- సూర్యాపేట డివిజన్ అధ్యక్షులుగా నెలమర్రి శ్రీను ఏకగ్రీవంగా ఎన్నిక.

సూర్యాపేట టౌన్ : నాలుగవ తరగతి ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేస్తానని సూర్యాపేట డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైన నేలమర్రి శ్రీను అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జానకి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన 11 మండలాల నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షులకు తెలియజేస్తానని, సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు.ఉద్యోగికి ఏ ఆపద ఉన్న తనని డైరెక్ట్ గా సమస్యలను తెలియజేయచ్చని,ఆ సమస్యలను పరిష్కరించే విధంగా అందరిని కలుపుకొని ముందుకెళ్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ రణపంగా చిన్న ఈదయ్య, కోశాధికారి ఎస్. కె. ఇబ్రహీం, ఉపాధ్యక్షులు చేకూరి సామ్రాజ్యం, సింగారం రామ నర్సయ్య, ఎల్క సాలుమన్, బరపాటి హవులయ్య, ఎస్ కే మీరా, కార్యవర్గ సభ్యులు బైరు మాణిక్యం, మాతంగి నాగలక్ష్మి, నరేష్, గుణ గంటి స్వాతి, బండ వెంకటేశ్వర్లు, పేరుమళ్ళ పూలమ్మ ,మామిడి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.