21వ అఖిలభారత పశుగణన కార్యక్రమం
జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల 21వ అఖిలభారత పశుగణన తేదీ 25/10/2024 నుంచి 28 ఫిబ్రవరి2025 వరకు జరుగును ఈ పశు గణన లో భాగంగా పశు వైద్య సిబ్బంది ఇటిక్యాల మండలంలో గల ఆయా గ్రామాలలో ప్రతి ఇంటికి వచ్చి పశువుల వివరాలు సేకరించడం జరుగుతుంది విషయ సేకరణ దారులకు పశువుల సేకరణ సమగ్ర సమాచారం అందించాలి తద్వారా పశువు గణ రంగా పథకాల రూపకల్పనకు సహకారం అందించగలరని ఇటిక్యాల పశు వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు