4వ రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరణ చేసిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
యాదగిరిగుట్ట 21 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సోమవారం రోజు యాదగిరిగుట్ట పట్టణం మున్సిపల్ ఆఫీసు ప్రాంఘాణంలో
ఎన్ పి ఆర్ డి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల కరపత్రాన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య ఆవిష్కరించారు. ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సహాయక కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా అధ్యక్షులు సురూపంగా ప్రకాష్ జిల్లా కోశాధికారి కొత్త లలిత యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు మెరుగు బాబు కార్యదర్శి సిక నరసింహ కోశాధికారి రంగ సంతు పాండాల శ్రీహరి ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్బంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య మాట్లాడుతూ..వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఎంపీ ఆర్ డి రాష్ట్ర మహాసభలు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయని తెలిపారు.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టన్ని సాధించడంలో ఎన్ పి ఆర్ డి పాత్ర చాలా ఉందని అన్నారు. దేశ వ్యాప్తంగా వికలాంగుల హక్కుల సాధన కోసం, చట్టాల అమలు కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందని అన్నారు.వికలాంగులపై జరుగుతున్న దాడులు, వివక్షత వంటి అంశాలపై ఉద్యమలు చేస్తుందని అన్నారు.విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని నిరంతరం పోరాటాలు చేస్తుందని అన్నారు. సామూహిక ప్రాంతాల్లో ర్యాంపూలు నిర్మించాలని ఐక్య పోరాటాలు చేస్తుందని తెలిపారు.
అక్టోబర్ 25-26 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ఎన్పీఆర్డి రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలను ప్రారంభించెందుకు ముఖ్య అతిథిగా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి డి సీతక్క, టీవీ సిసి చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఎన్ పి ఆర్ డి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నంభు రాజన్ హాజరు అవుతున్నారని తెలిపారు.మహాసభల ప్రారంభ సభ సందర్బంగా వికలాంగుల కళాకారులతో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.మహాసభలకు 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారని అన్నారు.మహాసభల్లో నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్స్ అమలు, పెన్షన్ పెంపు, స్వయం ఉపాధి, చట్టాల అమలు,ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
మహాసభల్లో రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.మహాసభల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.