హైడ్రా దూకుడుకు బ్రేకులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైడ్రా పనితీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో, సర్కార్ దిద్దుబాటు చర్యలకు మొగ్గు చూపుతోంది. హైడ్రా చర్యలతో రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన చెందుతుండగా, సామాన్య ప్రజల్లోనూ భయం నెలకొంది.
ఇటీవల బిల్డర్లతో జరిగిన సమావేశంలో, హైడ్రా చర్యల వల్ల కలిగే ఇబ్బందులను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (చెరువులు కుంటల బఫర్ జోన్ లో ఉన్న) చెల్లుబాటు అయ్యే అనుమతులతో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదని ఇటీవలే స్పష్టం చేశారు. ప్రజల్లో అలజడి రేగకుండా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉండగా, హైడ్రా ఇప్పుడు తన దృష్టిని పునరుజ్జీవన పనులపై కేంద్రీకరించింది.