స్వయంభు శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల13 జులై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండల్ సద్దలోనిపల్లి గ్రామoలో స్వయంభు శ్రీ కృష్ణ స్వామి దేవాల యాన్ని శనివారం గద్వాల కోర్టు ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జిస్ నేరెళ్ల వెంకట హైమ పూజిత సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు న్యాయమూర్తికి ఆలయ అర్చకులు పాండురంగ స్వామి కృష్ణయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామి వారి తీర్థప్రసాదాలు, అందుకున్నారు.