స్వచ్ఛమైన నీరు ఆరోగ్యానికి రక్ష
కాలుష్యం లోపల లేదా బయట రెండు హానికరం
-సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట పట్టణంలోని సద్దలచెరువు లో ఆదివారం శ్రీశ్రీశ్రీ బాబా హరదేవ్ సింగ్ జి మహారాజ్ వారి పుట్టినరోజు సందర్భంగా సంత్ సేవాలాల్ నిరంకార్ సంస్థవారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీరు కలుషిత నిర్మూలన కొరకై సద్ధల చెరువు చుట్టూ హానికరమైన ప్లాస్టిక్ చెత్తను తీయటం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుట కొరకై అపశుద్ధ కార్మికులు ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు అదేవిధంగా సంత్ సేవాలాల్ నిరంకారి వారు ఆదర్శంగా తీసుకుని కృషి చేస్తున్న సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా సంత్ సేవాలాల్ నిరంతర వారి మంచి ఆలోచన వారి కోరిక నిమిత్తమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు సూర్యాపేట స్థానిక శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారు సంత్ సేవల నిరంకారి సంస్థ వారికి అండగా నిలిచారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మాహాజాన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ సురేష్, జవాన్లు ప్రసాద్,శ్రీనివాస్, సంత్ సేవాలాల్ సభ్యురాలు సరళ, సేవలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.