స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం కింద

Aug 5, 2024 - 20:04
 0  7

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తేది;05.08.2024 నుండి తేది:09.08.2024 వరకు స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం కింద ప్రతిరోజు ప్రతి వార్డులో  షెడ్యూల్డ్  ప్రకారంగా కార్యక్రమం చేపట్టవలసినదిగా ఆదేశించియున్నారు. దీనిలో భాగంగా ఈరోజు స్వచ్ఛదనం- పచ్చదనంపై ర్యాలీని ఉదయం 10.00 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం నుండి శ్రీమతి ఎన్ పద్మావతి రెడ్డి, శాసనసభ్యురాలు కోదాడ గారి చేతుల మీదుగా ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడు విషయంలో, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన ముందస్తు చర్యల గురించి, కుక్కల కాటుల నుండి ప్రజలను కాపాడుట, వాటికి స్టెర్లైజేషన్ చేయుట, ప్లాస్టిక్ నిషేధము, చెట్లు నాటుట, సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు చేపట్టుట, ఫీవర్ సర్వే నిర్వహించుట వంటి కార్యక్రమాలను వార్డుల వారిగా చేపట్టడం జరుగుతుందని తెలిపినారు. ఈ ఐదు రోజులు చేపట్టు కార్యక్రమములపై ప్రజలకు అవగాహన కలిగించు నిమిత్తం ర్యాలీని నిర్వహించడం జరిగినదని తెలియజేసినారు. ప్రజలు కూడా ఇట్టి కార్యక్రమంలో భాగస్వాములై తమ వంతు పాత్రను నిర్వహించవలసినదిగా కోరినారు.

తదుపరి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద గల ప్రకృతి వనంలో వనమహోత్సవం  కార్యక్రమం కింద చెట్లు నాటడం జరిగినది. ఈ సందర్భంగా నాటిన ప్రతి చెట్టును బతికించు క్రమములో సంరక్షణ చర్యలు చేపట్టవలసినదిగా, మొక్కలకు నీరు పోయుట, పాదులు తీయుట ఒంటి కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయవలసినదిగా, ఓపెన్ ప్లేస్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయవలసినదిగా కమీషనర్ గారికి ఆదేశములు జారీ చేసినారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ, ఆర్డిఓ గారు, శ్రీమతి అంబటి రమాదేవి కమీషనర్, శ్రీమతి సామినేని ప్రమీల, చైర్ పర్సన్ గారు, శ్రీ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి టిపిసిసి డెలిగేట్ గారు, శ్రీ కందుల కోటేశ్వరరావు,  వైస్ చైర్ పర్సన్ గారు, కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ సభ్యులు,  పలువురు రాజకీయ నాయకులు, కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, పారిశుద్ధ్య జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, అన్ని విభాగాల అధిపతులు, కార్యాలయ సిబ్బంది పాల్గొనినారు.                                                                             ఇట్లు                                                కమీషనర్ & చైర్ పర్సన్,                         కోదాడ పురపాలక సంఘం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333