ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.... దేవర వెంకటరెడ్డి
మునగారా 21 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- రబ్బీలో తక్షణమే వరి పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు దేవరం వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఇప్పటికే బోర్ల కింద సాగు చేసిన వరి ధాన్యం కట్టింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు వర్షాభావంతో ఇప్పటికే సగం వరిసెలు ఎండిపోయాయి అన్నారు .కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో చేతికి అందిన పంటను రైతులు మధ్య దళారీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు ధాన్యాన్ని నిల్వ చేయడానికి రైతుల వద్ద గోదాములు లేవన్నారు ప్రభుత్వం తక్షణమే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధరల బ్యానర్లు పెట్టాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కూడా ఈ రబీ లోనే ఇవ్వాలన్నారు మద్దతు ధరలకు కొనుగోలు చేయని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రబ్బి సీజన్లో వరి కోతలు మొదలై పది రోజులు అవుతున్న నేటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు ఈ రబ్బీ సీజన్లో మొదట బస్తా వరి ధాన్యం 2100 రూపాయలకు కొనుగోలు చేసినారు నేడు 1750 కొనుగోలు చేస్తున్నారు తక్షణమే జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో రైతు సంఘాలతో మిల్లర్లతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందే ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరారు ఈ కార్యక్రమంలో దేవరం శ్రీనివాస్ రెడ్డి చింతకాయల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.