స్వచ్ఛందంగా మెడికల్ షాప్ లు బంద్

May 20, 2026 - 15:43
May 20, 2026 - 15:44
 0  118
స్వచ్ఛందంగా మెడికల్ షాప్ లు బంద్

తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో మెడికల్ షాపులు బంద్ పాటించాయి వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి తమ నిరసనను తెలిపారు ఆన్లైన్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయించడం వల్ల ప్రజలు మరియు ముఖ్యంగా యువత ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆన్లైన్ ఔషధ విక్రయాలను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి