రోడ్లకు తారురోడ్డు వేసి బస్సు నడపాలి..విద్యార్థి సంఘ నాయకులు
అడ్డగూడూరు 20 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంట ఎక్స్ రోడ్ వద్ద గురజాల నుండి జానకిపురం వరకు శంకుస్థాపన చేసి వదిలివేసిన ఎమ్మెల్యే బిటీ రోడ్డు పనులు ప్రారంభించి తొందరగా రోడ్డువేసి నకిరేకల్ నుండి మోత్కూర్ వయా అడ్డగూడూరు మీదుగా బస్సు నడిపించాలని ఏఐఎస్ఎఫ్,వీజెఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ..తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సొంత మండలం అడ్డగూడూరు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం శాలిగౌరారం నుండి 3 జిల్లాలను అనుసంధానం చేసే ఈ రహదారి పనులు నిలిచిపోవడంతో ప్రజలు,వాహనదారులు,విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు గుంతలు గుంతలుగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చొరవ తీసుకొని రోడ్డు పనులు త్వరగా పూర్తిచేసి మోత్కూర్ నుండి నకిరేకల్ వయా అడ్డగూడూరు మీదిగా బస్సు నడిపించాలని కోరారు.విజిఎస్ ఓయూ అధ్యక్షులు చెరుకు శివరాజ్ మాట్లాడుతూ..ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి చేయకపోతే విడతల వారీగా వెల్దేవి గట్టుసింగారం మానాయకుంట గ్రామాల ప్రజలను ఏకం చేసి ఉద్యమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ వి నాయకులు మేడబోయిన రాజు,బోయినపల్లి అఖిల్ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చిప్పలపల్లి వంశీ కుమార్ ఉప్పల వంశీ,నిఖిల్,విజెఎస్ నాయకులు నాని,శశికాంత్,గ్రామస్తులు సత్తయ్య,విజయ్ కుమార్,బాబు, లచ్చయ్య,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.