స్పోర్ట్స్ స్కూల్ కి బట్లదిన్నే పాఠశాల విద్యార్థిని ఎంపిక

జోగులాంబ గద్వాల 9 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. బట్లదీన్నే గ్రామప్రాథమిక పాఠశాలకు చెందిన నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎం సాత్విక (తండ్రి ఎం. సుంకన్న ) రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలో పాల్గొని హైదరాబాద్ లోని హాకింపెట్ స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపిక కావడం జరిగింది. జోగులంబగద్వాల్ జిల్లా నుండి ఈ విద్యార్థిని మాత్రమే ఎంపిక కావడం జరిగింది. ఈ విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగన్న, వాలంటీర్ ఉపాద్యాయుడు శ్రీనివాసులు అభినందించారు. స్పోర్ట్స్ పాఠశాల లో సీటు రావడానికి కృషిచేసిన పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థిని తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.