స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కోసం చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం 

Mar 19, 2025 - 18:49
 0  15
స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కోసం చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం 
స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కోసం చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం 

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయాలి

ఎన్,పి,ఆర్,డి జిల్లా కోశాధికారి కొత్త లలిత

భువనగిరి 19 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లలో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలని ఎన్ పి ఆర్ డి జిల్లా కోశాధికారి కొత్త లలిత,డిమాండ్ చేశారు.బుధవారం భువనగిరి టౌన్ 6 7 వార్డుల  స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 1నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లక్ష సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా భువనగిరి టౌన్ 6,7 వార్డులలో సంతకాల సేకరణ కార్యక్రమన్ని మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ డిసెబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం 43.02 లక్షల మంది (రాష్ట్ర జనాభాలో 12.02 శాతం) వికలాంగులున్నారు.రాష్ట్రంలో 2024 డిసెంబర్ నాటికి 12769  గ్రామ పంచాయతీలు,130 మున్సిపాలిటీలు,13 మున్సిపల్ కార్పొరేషన్స్,540 మండల పరిషత్లు,32 జిల్లా పరిషత్లు ఉన్నవి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పంచాయతీ రాజ్ చట్టానికి మరియు మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి,ఇద్దరు వికలాంగులను నామినేట్ చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018,తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లలో సవరణలు చేసి, ప్రత్యేక చట్టం చేసి వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము.స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తే గ్రామ పంచాయతీలలో 25,538 మందికి, మున్సిపాలిటీలలో 260 మందికి, మున్సిపల్ కార్పొరేషన్లలో 26 మందికి,మండల ప్రజా పరిషత్ లలో 1080 మందికి,జిల్లా పరిషత్లలో 64 మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి.రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 26,968 మందిని నామినేటెడ్ చేయడానికి అవకాశం ఉంది.కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు(నామినేట్) ప్రతినిత్యం కల్పిస్తూ  అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్,పి,ఆర్,డి టౌన్ నాయకురాలు దండు సరూప,పల్లెల గంగయ్య,దేశపాక కళ్యాణి,ఏర్పుల పోచమ్మ, పల్లర్ల సంధ్య,దండు పుష్ప,ఎం శిరీష, యాఖరి సౌందర్య,ఏర్పుల జాంగిర్,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333