సూర్యాపేట శివారులో కారు బోల్తా
సూర్యాపేట –ఖమ్మం జాతీయ రహదారిపై బండమీది చందుపట్ల సమీపంలో కారు ప్రమాదం జరిగింది.
సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న జాతీయ రహదారి సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.