సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Jun 16, 2026 - 20:52
 0  2
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

బాధితులకు వేగవంతమైన సేవలు,

బాధితుల ఇండ్లకు వెళ్లి కేసులు నమోదు చేస్తున్నాము.

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, మరియు ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అధికారులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు ఆదేశాలు చేశారు. బాధితులకు ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందిస్తున్నాము సంఘటనలపై సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేస్తున్నామని ఎస్పీ అన్నారు. అర్ధరాత్రి వేళ గ్రామాలలో రాత్రి బీట్ పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ సిబ్బంది సంచరిస్తూ ప్రజలకు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి వచ్చిన బాధితులతో మాట్లాడి మరి సమస్యలు అడిగి తెలుసుకున్నారు సమస్యలపై సిబ్బంది వేగంగా స్పందించాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ సందర్శించిన సందర్భంగా పోలీసు విధులపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని త్వరితగతిన స్పందించి న్యాయం చేయాలని అన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందించాలని, ముఖ్యంగా సంఘటనల గురించి సమాచారం అందిన వెంటనే బాధితుల వద్దకు వెళ్లి, వారి నివాసాల నుండే ఫిర్యాదులు స్వీకరించి, అక్కడి నుండే కేసులు నమోదు చేసే విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాను కఠినంగా నిరోధించాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు మరియు గంజాయి నిర్మూలనపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటి ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు. రాత్రి సమయంలో విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత, రక్షణ కల్పించాలని ఆదేశించారు.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు చేరువలో ఉంటూ మెరుగైన పోలీసింగ్ అందించాలని తెలిపారు. ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333