సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా వారాంతపు పోలీస్ పరేడ్

Jul 4, 2026 - 23:43
 0  9
సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా వారాంతపు పోలీస్ పరేడ్
సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా వారాంతపు పోలీస్ పరేడ్
సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా వారాంతపు పోలీస్ పరేడ్
సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా వారాంతపు పోలీస్ పరేడ్

హాజరైన జిల్లా ఎస్పీ నరసింహ.
- సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, పరేడ్‌ను పరిశీలించిన ఎస్పీ.
- పోలీస్ దర్బార్ నిర్వహించి, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా పోలీస్ బాస్.
- పోలీస్ యూనిఫాం అంటే ప్రజలకు ధైర్యం, భరోసా.
- సామాన్యులకు, బాధితులకు అండగా నిలిచి పోలీసు సేవలు అందించాలి.
- నేరాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా ఉండాలి.

....సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ,

సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీస్ పరేడ్‌ను ఈరోజు (శనివారం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా పోలీస్ ఎస్పీ నరసింహ హాజరై సిబ్బంది నుండి గౌరవ వందనం (సలామీ) స్వీకరించి, పరేడ్‌ను నిశితంగా పరిశీలించారు. పరేడ్ అనంతరం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 'పోలీస్ దర్బార్' నిర్వహించబడింది. ఈ సందర్భంగా సిబ్బంది తమకు ఎదురవుతున్న విధి నిర్వహణ పరమైన, వ్యక్తిగత సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సావధానంగా విన్న విని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని సిబ్బందికి హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి సి.వి.ఆనంద్ ప్రజలకు పోలీస్ సేవలు అందించే విషయంలో, నేరాల నిరోధంలో బాగా పని చేసే పోలీసులకు క్షేత్ర స్థాయిలో అభినందనలు తెలుపుతూ, రికార్డ్స్ అందిస్తున్నారు అన్నారు. సిబ్బంది అందరూ వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకు, బాధితులకు ఉత్తమైన పోలీసు సేవలు అందించాలి, గౌరవంగా ఉండాలి అన్నారు. సామాన్యుల, బాధితుల పక్షాన నిలవాలని, నేరాలకు పల్పడేవారిపట్ల, చటాన్ని ఉల్లంఘించే వారిపట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలి అన్నారు. వ్యక్తిగతమైన క్రమశిక్షణ, వృత్తిపరమైన క్రమశిక్షణ కలిగివుండాలి అని కోరారు. ఈ వారాంతపు పరేడ్ ద్వారా  పోలీసు పని తీరుపై "పోలీస్ సిబ్బందిలో పరస్పర సమన్వయం, క్రమశిక్షణ మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. సమాజంలో పోలీస్ శాఖకు ఒక ప్రత్యేకమైన స్థానం మరియు గౌరవం ఉన్నాయి. ప్రజలు మనం ధరించే యూనిఫాంను గౌరవిస్తారు. కాబట్టి సిబ్బంది అందరూ నిబంధనల ప్రకారం చక్కని యూనిఫాం ధరించి, గౌరవప్రదంగా ప్రజలకు సేవలు అందించాలి. పోలీస్ అంటే సమాజంలో శాంతిభద్రతలకు ప్రతీక మాత్రమే కాదు, ప్రజలకు ధైర్యం మరియు భరోసా కల్పించే వ్యవస్థ" అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్మ్‌డ్ రిజర్వ్ అడ్మిన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్.ఎస్ఐ లు, ఎస్ఐ లు, ఏఆర్ విభాగపు అధికారులు మరియు పోలీస్ సిబ్బంది, సూర్యాపేట టౌన్ పీస్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఆత్మకూరు, సూర్యాపేట రూరల్, పెనపహాడ్, చివ్వేంల స్టేషన్ల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333