ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 పోస్టర్ ఆవిష్కరణ

Jun 3, 2026 - 20:04
 0  1
ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 పోస్టర్ ఆవిష్కరణ

నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నియంత్రించాలి: కలెక్టర్

 జోగులాంబ గద్వాల 3జూన్ 2026తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.ప్లాస్టిక్ కాలుష్యం భూమి, నీరు,జీవ వైవిధ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు.పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలైన గుడ్డ సంచులు,స్టీల్ బాటిళ్లు, గాజు సీసాలు,వెదురు ఉత్పత్తులు,ఆకు పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా వర్గీకరించి పారవేయడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని  పేర్కొన్నారు. తగ్గిద్దాం – తిరిగి వాడుదాం – పునర్వినియోగం చేద్దాం” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పచ్చదనంతో కూడిన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన,వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వంటి చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. “మన భూమి – మన బాధ్యత” అనే భావనతో ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ పాపయ్య, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డా.విద్యులత,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333