సూరారపు కృష్ణవేణి నియామకం పట్ల హర్షం

Jul 16, 2026 - 22:02
Jul 16, 2026 - 22:50
 0  6
సూరారపు కృష్ణవేణి నియామకం పట్ల హర్షం

  తిరుమలగిరి 17 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :-  తెలంగాణ రక్షణ సేన తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జిగా సూరారపు కృష్ణవేణి (కృష్ణక్క) నియమితులైన సందర్భంగా తిరుమలగిరి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు, యువత పాల్గొని స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నాయకురాలు సంపతి సైదమ్మ మాట్లాడుతూ, పార్టీ అధినేత కల్వకుంట కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో సూరారపు కృష్ణవేణిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు తుంగతుర్తి ప్రాంత ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన నాయకురాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే సామర్థ్యం ఆమెకు ఉందని సైదమ్మ పేర్కొన్నారు. పేద ప్రజల సేవే లక్ష్యంగా కృష్ణవేణి ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా పార్టీ ఆమెకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని అన్నారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ సమస్యల పరిష్కారం మరియు ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగాత్వరలోనే మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు భవాని రేణుక ,కుసుమ యువత, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి