మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
తిరుమలగిరి 17 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం గ్రామంలోని మన ఇసుక వాహనం ట్రాక్టర్స్ యూనియన్ సభ్యులు చిలుకాని లింగస్వామి ఇటీవల పాముకాటుతో మృతి చెందడంతో దశదిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ట్రాక్టర్స్ యూనియన్ తరపున ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు రూ. 45000 రూపాయలు ఆర్థిక సహాయంను అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో ట్రాక్టర్స్ యూనియన్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు