చామంతి పూల తోటను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
తుంగతుర్తి మండల శివారులో రాజా నాయక్ తండ లోని చామంతి పూల తోటను తనిఖీ
తుంగతుర్తి 17 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామ రెవెన్యూ శివారులలో రాజా నాయక్ తండ సర్పంచ్ బిచ్చు నాయక్ ఫాలిహౌస్లో సాగు చేస్తున్న చామంతి పూల తోటను జిల్లా కలెక్టర్ తేజస్సు నందులాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మండల అధికారులు సందర్శించి జిల్లా ఉద్యానవన అధికారి తీగల నాగయ్య తో చామంతి పూల మొక్కలను పరిశీలించారు. ఈ తోటలకు అనువైన ప్రాంతం ఎర్ర నేలలు బలమైన నెలలలో పూల చెట్లకు అణువుగా ఉంటుందని పాళీహౌస్తో నిర్మించిన ఈ పెద్ద తోటలో మొక్కలను పరిశీలించి ఉద్యాన అధికారి తీగల నాగయ్యతో మాట్లాడుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య తాసిల్దార్ దయానందం ప్రాంతీయ ఉద్యాన అధికారి ప్రమీత విస్తరణ అధికారి ప్రభాకర్ తో పాటు పలు మండలాల డీటీలు ఆర్ఐలు పలువురు రైతులు పాల్గొన్నారు.