సీజనల్ వ్యాధుల నియంత్రణకు అప్రమత్తంగ ఉండాలి. డిఎంహెచ్వో
జోగులాంబ గద్వాల 4 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా,, సంధ్య కిరణ్మై జిల్లా కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజరీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతు, జిల్లాలో అమలవుతున్న జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సూచికల వారీగ సమీక్షించి, అన్ని కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి మెరుగైన ప్రగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. సూపర్వైజరీ సిబ్బంది అన్ని ఆరోగ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఫీల్డ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించి కార్యక్రమాలను సమర్థవంతంగ అమలు చేయాలని తెలిపారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియ, డెంగీ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో విస్తృతంగ అవగాహన కల్పించి వ్యాధులు వ్యాపించకుండ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫీల్డ్ సిబ్బంది అప్రమత్తంగ ఉండి నిరంతర ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) సర్వేను క్రమం తప్పకుండ నిర్వహిస్తూ, అర్హులందరికీ స్క్రీనింగ్ చేపట్టి, అనుమానిత (Suspect) కేసులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, స్క్రీనింగ్ శాతం పెంచడంతో పాటు ఫాలోఅప్‌ను కూడ తప్పనిసరిగ నిర్వహించాలని తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన, నిరంతర ఆరోగ్య సేవలు అందించాలని, గర్భిణిగ గుర్తించిన వెంటనే ప్రతి గర్భిణీని నమోదు చేసి అవసరమైన అన్ని పరీక్షలు, సేవలు, వ్యాధి నిరోధక టీకాలు సమయానికి అందేల చూడాలని సూచించారు.
ప్రతి చిన్నారికి పూర్తి స్థాయి వ్యాధి నిరోధక టీకాలు అందేల చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల అవసరమైన మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉండేల పర్యవేక్షించాలని తెలిపారు.
అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలను ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిరంతరంగ నిర్వహించాలని, సూపర్వైజరీ సిబ్బంది సమయపాలన పాటించి సేవలందించాలన్నారు.
HMIS, MCH పోర్టల్‌లలో ప్రతిరోజూ సమాచారాన్ని నమోదు చేయాలని, ప్రతి ఆరోగ్య కార్యక్రమం లక్ష్యాల సాధనపై PHC వారీగ సమీక్ష నిర్వహించి నిర్దేశించిన గడువులోనే ప్రగతి సాధించేల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి ప్రోగ్రామ్ అధికారులు, సూపర్వైజరీ సిబ్బంది పాల్గొన్నారు. సమావేశంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతమైన అమలుపై పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు.