సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి
పాపన్న గౌడ్ పోరాట చరిత్ర మరవలేనిది
సర్వాయి పాపన్న నేటి యువతరానికి ఆదర్శం
తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్
సూర్యాపేట టౌన్ ఏప్రిల్ 2:- బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత బహుజనులు రాజా అధికారం కోసం ఉద్యమించాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమా లాలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మొగల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం హర్ష నియమన్నారు. 12 మందితో ఏర్పాటైన పాపన్న గౌడ్ సైన్యం 12,000 మంది సైన్యాన్ని తయారుచేసి బహుజన రాజ్యాన్ని నెలకొల్పిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, ప్రతీక అన్నారు.పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్క బహుజన బిడ్డ తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించాలని పంతంగి వీరస్వామి గౌడ్ విజ్ఞప్తి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని కోరారు. తెలంగాణ ప్రాంతాలలోనీ అన్ని జిల్లా కేంద్రాలలో పాపన్న గౌడ్ విగ్రహాలను నెలకొల్పడంతోపాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి అని పంతంగి వీరస్వామి గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దల చెరువు నీల ట్యాంకు మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం త్వరలో ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్లో కూడా కలెక్టర్ తేజస్ నందలాల్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులు న్యాయవాదులు డాక్టర్లు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘ నాయకులు పుర ప్రముఖులు కౌన్సిలర్లు ఉద్యమ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు గవర్నమెంటు ఆఫీసర్లు ముఖ్య అతిథులు డాక్టర్ రామ్మూర్తి గారు సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు తలమల్ల హుస్సేన్ మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్ బొమ్మ గాని శ్రీనివాస్ గౌడ్ కక్కిరేనీ నాగయ్య గౌడ్ కక్కినేని సత్యనారాయణ గౌడు రాంబాబు గౌడ్ మడ్డి అంజిబాబు గౌడ్ ఉయ్యాల నగేష్ గౌడ్ శేఖర్ బత్తుల జనార్దన్ గౌడ్ అబ్బ గాని బిక్షం గౌడ్ బట్టి మళ్ళీ నాగ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహదరుడు దేవత్ కిషనాయక్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాజీ రెడ్డి గోపాల్ రెడ్డి బానోతు జానీ నాయకు కొత్తపల్లి వెంకన్న పట్టేటి కిరణ్ తన్నీరు వాసు శ్రీనివాస్ రెడ్డి రాపర్తి జానయ్య శ్యామ్ సారగండ్ల కోటేషూ తదితరులు పాల్గొన్నారు.