సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్. అందుబాటులో లేని వార్డెన్లు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యం. 

Aug 10, 2026 - 16:30
Aug 10, 2026 - 16:31
 0  0
సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్. అందుబాటులో లేని వార్డెన్లు.
సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్. అందుబాటులో లేని వార్డెన్లు.
సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్. అందుబాటులో లేని వార్డెన్లు.

జోగులాంబ గద్వాల 10 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాంఘిక వెనకబడిన మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో సమస్యల వలయంలో కొట్టుమిత్తుతున్నాయి. వార్డెన్ లో నిత్యము హాస్టల్లోనే ఉంటూ విద్యార్థుల పాలన. అలనా చూసుకోవాల్సి ఉన్నది. వార్డెన్ అందుబాటులో లేక దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడంతో హాస్టల్ లోని పేద విద్యార్థులు సమస్యలు పరిష్కరించే పరిస్థితులు కనుమరుగయ్యాయి. నిత్య హాస్టల్లో  ఉండి. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన బాధ్యత వార్ధాన్లపైనే ఉన్నది. కానీ నేడు పరిస్థితులు భిన్నంగా మారాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో హాస్టల్లోని పేద విద్యార్థులు ఇళ్లకు ఎక్కువ శాతం వెళ్లారు. ఉన్న కొద్ది మంది విద్యార్థులు కూడా అసౌకర్యాల మధ్యన సరైన వసతులు లేకపోవడంతో ఇరుకు ఇబ్బందులతో ఉండలేక ఇండ్లకు వెళ్లారు. సెలవులు వచ్చిన విద్యార్థుల హాస్టల్ లోనే ఉండి చదువుకునేందుకు వార్డెన్లు ప్రత్యేక చురువచూపాలి. కానీ అలాగా లేకపోవడం గర్వకారణం.

దుస్తులు కాస్మొదటి చార్జీలు అందలేదు.

హాస్టల్ లో ఉండే పేద విద్యార్థులకు రెండు నెలలు ప్రభుత్వ పాఠశాల పునర్ ప్రారంభమైన హాస్టల్లోని విద్యార్థులకు దుస్తులు కాస్మెటిక్   ఛార్జీలు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెల హాస్టల్ విద్యార్థికి కాస్మోటిక్ చార్జీల కోసం నెలకు 200 రూపాయలు ప్రభుత్వ అందజేస్తుంది. రెండు నెలలు గడిచిన ఇంతవరకు సబ్బుల బిల్లులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నారు. హాస్టల్లో పరిసరాలు. పరిశుభ్రంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వార్డెన్ల పైనే ఉన్నది. వార్ధాన్ల పర్యవేక్షణ లేకపోవడం వలన పరిసరాలు కూడా అపరిశుభ్రంగానే దర్శనం ఇస్తున్నాయి. వార్డెన్లు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది వాళ్లకే గుర్తు అన్నట్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులకు ఉదయము సాయంత్రం వేళలో స్టడీ అవర్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. వార్డెన్ల నిత్యము ప్రతి విద్యార్థిని పరిశీలించి చదువుకునేందుకు ఆసక్తి చూపాలి వార్డెన్ బాధ్యత గురువు తల్లిదండ్రుల సంరక్షణ కర్తగా ఉండి నిత్యం విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత వార్డెన్ పైనే ఉన్నది. విద్యార్థుల చేతిలో చిల్లిగవ్వ కూడా లేక దుస్తులు ఉతుక్కోవడానికి సబ్బులు లేక హెయిర్ కటింగ్. తలనూనె తదితర సమస్యలు వేధిస్తున్నాయి. కొత్తగా వచ్చిన విద్యార్థుల పరిస్థితి అగోరంగం ఉంది. పాత విద్యార్థుల్ని పట్టించుకోకుండా పోవడంతో కొత్తగా చేరిన విద్యార్థులను బెదిరింపుల కు అవకాశం ఉంది. వార్డన్లతో మాట్లాడడానికి కొత్తగా చేరిన విద్యార్థులు దిగులు చెందుతున్నారు.

గద్వాల్ లోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో పరిసరాలు శుభ్రంగా చెత్త సేకరణలో అధికారులు నిర్లక్ష్యంగా నువ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వారం రోజులైనా చెత్త తీసుకోకుండా పోవడం తో పరిసరాలు ప్రభావం వల్ల ఈగలు దోమలు వ్యాప్తి చెంది హాస్టల్లోని పేద విద్యార్థులకు అనారోగ్యాలు పాలయ అవకాశం మెండుగా ఉంది. మున్సిపాలిటీ అధికారులు చేసి చేసి సాంఘిక సంక్షేమ హాస్టల్లోని చెత్త సేకరణలో నిత్యము పరిశుభ్రంగా ఉండేందుకు రోజు చెత్త నూ తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. 

మధ్యాహ్నం వేళల్లో హాస్టల్ విద్యార్థులకు సాంబారు అన్నం మాత్రమే. 

ఎస్సీ ఎస్టీ బీసీ ఆనంద నిలయం హాస్టల్లోనూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేనప్పుడు హాస్టల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హాస్టల్లో సాంబారు రైస్ మాత్రమే వడ్డించడంతో విద్యార్థులు తినలేక పారవేశ పరిస్థితులు ఏర్పడ్డాయి. హాస్టల్లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్న భోజనాలు ఆకుకూరలతో పప్పు అన్నము వంటి భోజనాలు రుచికరంగా ఉండడంతో సెలవులప్పుడు హాస్టల్లో సాంబారు అన్నం పెట్టడం వలన విద్యార్థులు రుచికరం లేని ఆహార భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నదా అధికారులు హాస్టల్లోనే విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State