విన్నపం ఒక పోరాటం సూచన ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు పండుగ
గోపాలపురం 10 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- గోరింటాకు పండుగ ఘనంగా విన్నపం ఒక పోరాటం సూచన సంస్థ ఆధ్వర్యంలో గోపాలపురం గ్రామంలో ఆదివారం ఆషాడమాసం సందర్భంగా విన్నపo ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి గౌడ్ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వంనీ ఆషాడంను గోరింటాకు ఒకరోజు గుర్తింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అట్లూరి మంజుల, పద్మ, సుష్మ, ఏటీఎం స్వరూప రాణి, అంజమ్మ, రమాదేవి గిరిజా లక్ష్మీ, విజయ సంధ్య, నాగేంద్రమ్మ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.