యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ

Jun 27, 2026 - 17:26
 0  1
యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ
యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ

స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.

జోగులంబ గద్వాల 27 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : రైతుల ఇబ్బందులను తొలగించేందుకు పారదర్శకంగా యూరియా బుకింగ్ యాప్ ను స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు వరుసలో నిలబడి ఎరువులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఇక మీదట ఉండదని. ఇంటిదగ్గరనే లేక ఎక్కడబడితే అక్కడ యాప్ ద్వారా నమోదు చేసుకొని సులువుగా ఎరువులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఫిల్లింగ్ బుకింగ్ యాప్ ను రైతులు ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఓటిపి వస్తుందని అన్నారు. దీని ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ యాప్ ద్వారా బ్లాక్ మార్కెట్ నివారించవచ్చని. అక్రమలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం వీర నాయక్. గద్వాల డివిజన్ మండల వ్యవసాయ అధికారి. ప్రతాప్ వ్యవసాయ విస్తరణ అధికారులు. ఎరువుల డీలర్లు. రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333