సంఘబంధాల రుణాల చెల్లింపుల పై విచారణ

Apr 17, 2025 - 20:30
 0  62
సంఘబంధాల రుణాల చెల్లింపుల పై విచారణ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ *సంఘబంధాల రుణాల చెల్లింపుల పై విచారణ* ఆత్మకూరు ఎస్. మండల పరిధిలోని నెమ్మికల్ రెండో సంఘబందం లావాదేవీలలో వచ్చిన ఆరోపణలపై గురువారం జిల్లా అధికారులు విచారణ నిర్వహించారు. స్థానిక సంఘబంధాలు మహిళలు ఇచ్చిన పిర్యాదు తో ఇరువర్గాల ను విచారించారు.సంఘబందం గ్రూపుల వారు చెల్లించిన డబ్బులు సరైన సమయం లో చెల్లించడం లో కొంత తేడా వచ్చినట్లు తెలిపారు. చెల్లించిన డబ్బుల్లో జమచేయడం లో జాప్యం జరిగింది తప్ప తేడాలు ఏమి లేవని అధికారులు తేల్చారు. వి ఓ ఏ శ్రీనిధి రుణాలను జమ చేయడం లో జాప్యం చేయకూడదని తెలిపారు.ఈ కార్యక్రమం లో డిపిఎం రత్తయ్య, సిసి చందు, శ్రీ శక్తి మేనేజర్ సతీష్, సంఘం అధ్యక్షురాలు నాగమణి, వెంకటరమణ, బీరెల్లి పరిమళ, కృష్ణవేణి, వి ఓ ఏ ఇందిర,కళమ్మ తదితరులు పాల్గొన్నారు