సంకాపురం గ్రామ పాఠశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం కొరకు సహాయార్థం

May 4, 2025 - 20:14
 0  18
సంకాపురం గ్రామ పాఠశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం కొరకు సహాయార్థం

అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు .

జోగుళాంబ గద్వాల 4 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అలంపూర్. నియోజకవర్గం అయిజ మండలం *సంకాపురం గ్రామంలో 8,9,10 తరగతి విద్యార్థులకు ఉత్తనూర్  ఉన్నత పాఠశాల కు పోవడానికి 2024-2025 విద్యా సంవత్సరం లో దాదాపు 50 మంది విద్యార్థులకు సంవత్సరం మొత్తం తన సొంత నిధులతో వాహనం రవాణా సౌకర్యం కొరకు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు * *చేతులు మీదుగా 1,32,000 రూపాయలు నగదును డ్రైవర్ కు అందజేశారు. తదనంతరం సంకాపురం గ్రామంలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించినందుకు విద్యార్థులు అందరూ కలిసి మాజీ సర్పంచ్ సుజాత రాముడు మరియు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం  రాముడిని . ఘనంగా శాలువ పూలమాలలు తో సత్కరించారు. సంకాపురం గ్రామంలో పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులకు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు  దంపతులు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ పై ఉన్నత చదువులు చదివి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333