శ్రీ శేషదాసుల ఆరాధన ఉత్సవాలు.
జోగులాంబ గద్వాల 1 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్,. మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో వెలసిన శ్రీ శేషదాసుల 140 వ ఆరాధన ఉత్సవాలు ఈనెల 4, 5, 6 తేదీలలో జరగనున్నవని శేషదాసుల వంశీస్థుడు ధీరేంద్ర దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 4 తేదీన పంచామృతభిషేకం,శ్రీ ధన్వంతరి హోమం, పండితులచే ప్రవచనములు, తీర్థ ప్రసాదములు,భజన మండలి వారిచే భజన కార్యక్రమం,దాసవాణి కార్యక్రమం, 5వ తేదీన పంచామృతభిషేకం,పవమాన హోమం, రథోత్సవం భజనచే వివిధ భజన మండలి వారిచే, పండితులచే ప్రవచనములు, దాసవాణి కార్యక్రమం,6వ తేదీన పంచామృత అభిషేకం, శ్రీ సత్యనారాయణ పూజ, భజన కార్యక్రమం, పండితులచే ప్రవచనం, తీర్థ ప్రసాదములు జరుగుతాయి. అని దేవాలయం సిబ్బంది తెలియజేశారు.